prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 6:35 pm Digital Edition : PRAJA VANI

ప్రతి గడపకూ ప్రభుత్వ భరోసా.. జీవిత బీమాతో ఆర్థిక ధీమా

ప్రతి గడపకూ ప్రభుత్వ భరోసా.. జీవిత బీమాతో ఆర్థిక ధీమా
​కులకచర్లలో ఘనంగా బీమా పథకం కార్యక్రమం
​పరిగి / కులకచర్ల, నవంబర్ 25 (ప్రజావాణి ):
అనుకోని ఆపదలో కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘ప్రతి కుటుంబానికి ఒక భరోసా’ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్వాల అంజిలయ్య, పీఏసీఎస్ చైర్మన్ బొలసాని భీమ్ రెడ్డి పాల్గొని ప్రజలకు పథకం వివరాలను తెలియజేశారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం రోడ్డున పడకుండా నామినీ ఖాతాలో రూ. 5 లక్షల బీమా పరిహారం జమ అవుతుందని, అర్హులంతా తప్పకుండా నమోదు చేసుకోవాలని కోరారు.
​కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ప్రధాన కార్యదర్శి లాలు, అధికార ప్రతినిధి మోత్కూరు వెంకటేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్, నాయకులు చెలిమిల్ల ఆనందం, కుమ్మరి స్వామి, టి. రామచంద్రయ్య, ఎల్లయ్య, కడ్మూర్ రాంరెడ్డి, కర్రె వినోద్ కుమార్, కృష్ణయ్య, భాను, గ్రామ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.