prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 9:25 am Digital Edition : PRAJA VANI

పేద ప్రజల బియ్యం పక్కదారి తరలిస్తు ఉండగా పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ

పేద ప్రజల బియ్యం పక్కదారి తరలిస్తున్న ఉండగా పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ

అక్రమంగా తరలిస్తున్న 360 కిలోల రేషన్ బియ్యం పట్టివేత

నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలం గవిచర్ల గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో, మంగళవారం మధ్యాహ్నం గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య గుడి బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో గవిచర్ల గ్రామానికి చెందిన కొంతం జగదీష్ (50) వద్ద 10 ప్లాస్టిక్ సంచులలో ఉన్న 3.60 క్వింటాళ్ల (360 కిలోల) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం కిలోకు రూ.57 చొప్పున స్వాధీనం చేసుకున్న బియ్యం మొత్తం విలువ రూ.20,520.
సదరు వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలలోని లబ్ధిదారుల వద్ద రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా లేదా రవాణా చేసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంగెం ఎస్సై కె. వంశీకృష్ణ హెచ్చరించారు.ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ జి. రమేష్, కానిస్టేబుళ్లు బి. శ్రవణ్, ఎన్. రాజు పాల్గొన్నారు.