prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 12:18 pm Digital Edition : PRAJA VANI

పెనుగంచిప్రోలు మండలంలో పంచాయతీ ఎన్నికలలో బోనీ కొట్టిన తెలుగుదేశం పార్టీ

పెనుగంచిప్రోలు మండలంలో పంచాయతీ ఎన్నికలలో బోనీ కొట్టిన తెలుగుదేశం పార్టీ

ముండ్లపాడులో సర్పంచ్ గా ఉమ్మినేని నరేష్ ఏకగ్రీవం

పెనుగంచిప్రోలు, నవంబర్ 24 మన ప్రజావాణి

మండలంలోని ముండ్లపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బోనీ కొట్టింది. గ్రామ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మినేని నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గ్రామ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మినేని నరేష్ నామినేషన్ దాఖలు చేశారు. అదే గ్రామానికి చెందిన నలజాల శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఈరోజు నామినేషన్ ఉపసంహరణలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి నలజాల శ్రీనివాసరావు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

దీంతో గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థికి పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి ఉమ్మినేని నరేష్ ఏకగ్రీవంగా గెలిచినట్లు తీర్మానించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉమ్మినేని నరేష్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.