జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి గ్రామానికి చెందిన చిక్కుడు కనకలక్ష్మి – ఐలయ్య ల ద్వితీయ కుమారుడు నరేష్ వివాహం శివానితో బుధవారం మునిగడపలో ఘనంగా జరిగింది.
అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన పాశం మణెమ్మ – కనకయ్య ల ఏకైక పుత్రిక మనస్విని వివాహము సాయికుమార్ తో కిష్టంపేటలోని మల్లికార్జున గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకలకు హాజరైన కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, అన్యోన్యంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు బొచ్చు ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి కనకరాజు, చింతల రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు మరియు కొమురవెల్లి గ్రామ యువకులు, నాయకులు పాల్గొన్నారు.