నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 పల్నాడు జిల్లా నరసరావుపేట: స్థానిక మున్సిపల్ స్టేడియంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్సెంటర్ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణకు ఏర్పాటు చేసిన కౌంటర్లు, అధికారులకు మరియు సిబ్బందికి కల్పించిన వసతులు, వాహనాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపైఅధికారులను వివరాలు అడిగి...