prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 5:28 pm Digital Edition : PRAJA VANI

నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల

నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 పల్నాడు జిల్లా

నరసరావుపేట: స్థానిక మున్సిపల్ స్టేడియంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్సెంటర్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణకు ఏర్పాటు చేసిన కౌంటర్లు, అధికారులకు మరియు సిబ్బందికి కల్పించిన వసతులు, వాహనాల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

అలాగే స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపైఅధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలుకల్పించాలని అధికారులకుసూచించారు.మధ్యాహ్నం నుంచే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి,సకాలంలో చేరుకోవాలని కలెక్టర్ కృతిక శుక్లఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.