చదువులోనే కాదు.. సృజనాత్మకతలోనూ సైంటిస్టులుగా ఎదుగుతున్న విద్యార్థులు
*చదువులోనే కాదు.. సృజనాత్మకతలోనూ సైంటిస్టులుగా ఎదుగుతున్న విద్యార్థులు!* ప్రతిభకు పట్టం కడుతున్న శ్రీ వివేకవర్ధిని విద్యాసంస్థ.. జిల్లా స్థాయి పోటీల్లో రెండు ద్వితీయ బహుమతులు.. ఇన్స్పైర్ ప్రాజెక్టుకు రాష్ట్రస్థాయి అవకాశం కేసముద్రం నవంబర్ 24,ప్రజావాణి. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలను చదవడం, పరీక్షల్లో మార్కులు సాధించడం మాత్రమే కాదు.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, కొత్త ఆలోచనలకు పదును పెట్టడం, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల దిశగా వారిని నడిపించడం కూడా అసలైన విద్యకు నిర్వచనం. అలాంటి విద్యా లక్ష్యంతో విద్యార్థుల ప్రతిభకు...