prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 10:37 am Digital Edition : PRAJA VANI

ఘనంగా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు

*ఘనంగా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదిన వేడుకలు*

*కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఇంచార్జ్ డా చంద్రశేఖర్*

జహీరాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో రెట్టింపు విశ్వసంతో ప్రజా సేవా చెయ్యాలని, గ్రామ ప్రజలకు మరింత సమీపం అయ్యేవిధంగా ముందుకు సాగాలని ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ఆకాంక్షించారు. మంగళవారం నాడు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ లచ్చనాయక్ తండా సర్పంచ్ ప్రేమ్ రాథోడ్ జన్మదినన్ని పురస్కరించుకొని ఆయనకు శాలువాకప్పి పూలమాలతో సత్కరించిన అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సందర్భంగా ప్రేమ్ రాథోడ్ కి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కలల్ నరేష్ గౌడ్, పార్టీ మండలల అధ్యక్షులు పవన్ రాథోడ్, మల్లన్న పాటిల్, కోహిర్ పట్టణ అధ్యక్షులు ముజఫ్ఫర్ హుసేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్షద్ అలీ, మక్సుద్ ఆహేమద్, మంకల్ సుభాష్, కాంగ్రెస్ నాయకులు శంశీర్ అలీ, జిల్లా యువజన నాయకులు శ్రీనివాస్ పవార్, మజీద్ ఇంజీనియర్, మొహమ్మద్ ముజమ్మిల్, కార్యకర్తలు పాల్గొన్నారు.