ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు365 ఒత్తులు, కోటి ఒత్తుల దీపోత్సవంతో భక్తుల ప్రత్యేక దీపారాధననస్రుల్లాబాద్, నవంబర్ 24 (ప్రజావాణి): నస్రుల్లాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇళ్ల వద్ద ఉన్న తులసి కోటల దగ్గర 365 ఒత్తులు, కోటి ఒత్తులతో ప్రత్యేక దీపారాధనలు నిర్వహించారు. ఆలయాలు, ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.కార్తీక పౌర్ణమిని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర పర్వదినంగా భావిస్తారు. త్రిపురాసుర సంహారానికి...