prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 11:59 am Digital Edition : PRAJA VANI

గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న సర్పంచ్ ఈరేష్ మధునేకర్

*గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న సర్పంచ్ ఈరేష్ మధునేకర్*

*వీబీజీ రాంజీ పథకం కింద రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష.. అధికారులతో సమన్వయ సమావేశం*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 24:–
తానూర్: గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తానూర్ మండలం జాల కె గ్రామ సర్పంచ్ ఈరేష్ మధునేకర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఈరేష్ మధునేకర్ ఆధ్వర్యంలో, ఉపాధి హామీ ఏపీఓ శివలింగం సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీబీజీ రాంజీ పథకం కింద గ్రామంలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని సర్పంచ్ ఈరేష్ మధునేకర్ పేర్కొన్నారు.