prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 5:13 pm Digital Edition : PRAJA VANI

గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టు జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పోకల మాన్యత ఎంపిక

గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టు
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పోకల మాన్యత ఎంపిక

మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ కోట నరేందర్ రెడ్డి

మద్దూరు నవంబర్25, ప్రజా వాణి,

గోల్‌కీపర్‌గా తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
మండల కేంద్రంలోని పి ఏం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, మద్దూరులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పోకల మాన్యత జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచిందనీ ప్రిన్సిపాల్ కోట నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మాన్యత అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల నవంబర్ 26 నుంచి 29 వరకు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున గోల్‌కీపర్‌గా ప్రాతినిధ్యం వహించనుందన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కోటా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం మాన్యతను,ఆమెకు క్రీడా శిక్షణ అందించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దామెర ప్రేమ్ కుమార్‌ను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాన్యతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయికి ఎంపికైన పోకల మాన్యత పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఉపాధ్యాయ బృందం పేర్కొంది. ప్రాతినిధ్యం పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొననున్న విద్యార్థిని
మద్దూరు: మండల కేంద్రంలోని పి ఏం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల, మద్దూరులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పోకల మాన్యత జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మాన్యత అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల నవంబర్ 26 నుంచి 29 వరకు పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున గోల్‌కీపర్‌గా ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కోటా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం మాన్యతను, ఆమెకు క్రీడా శిక్షణ అందించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దామెర ప్రేమ్ కుమార్‌ను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాన్యతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయికి ఎంపికైన పోకల మాన్యత పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఉపాధ్యాయ బృందం అన్నారు.