prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 8:43 pm Digital Edition : MAHESH MEDCHAL

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి వెండి ఆభరణాల సమర్పణ 1 కిలో 81 గ్రాముల వెండితో కిరీటం, నాలుగు చేతుల ఆభరణాలు విరాళం అందజేత

*కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి వెండి ఆభరణాల సమర్పణ
1 కిలో 81 గ్రాముల వెండితో కిరీటం, నాలుగు చేతుల ఆభరణాలు విరాళం అందజేత
మేడ్చల్, నవంబర్ 25 (ప్రజావాణి): ప్రముక పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుడు వెండి ఆభరణాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ, ఎం.వి.ఆర్. కాలనీకి చెందిన పేరి శ్రీనివాస్ స్వామివారికి వెండి కిరీటంతో పాటు నాలుగు చేతులకు సంబంధించిన వెండి ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఈ ఆభరణాల మొత్తం బరువు 1 కిలో 81 గ్రాములు (1,081 గ్రాములు)గా ఉంది.
స్వామివారిపై భక్తి, విశ్వాసంతో వెండి ఆభరణాలను సమర్పించిన పేరి శ్రీనివాస్‌ను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెంకటేశ్ శర్మ దంపతులు, రిటైర్డ్ ఈఓ రామారావు, ఆలయ అర్చకులు రవిశర్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.