కార్మికుల ప్రాణ భద్రతపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు

డ్రైనేజ్ పనులు చేపట్టే మున్సిపల్ సిబ్బందికి రక్షణ పరికరాలు అందించాలి – గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ గుండ్లపోచంపల్లి: సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ శుభ్రం చేసే పనులు చేపట్టే మున్సిపల్ కార్మికులకు అధికారులు తగిన రక్షణ పరికరాలు అందించాలని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కోరారు. ఇటీవల సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ...