prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 8:28 pm Digital Edition : MAHESH MEDCHAL

కార్మికుల ప్రాణ భద్రతపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు

డ్రైనేజ్ పనులు చేపట్టే మున్సిపల్ సిబ్బందికి రక్షణ పరికరాలు అందించాలి
– గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్
గుండ్లపోచంపల్లి: సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ శుభ్రం చేసే పనులు చేపట్టే మున్సిపల్ కార్మికులకు అధికారులు తగిన రక్షణ పరికరాలు అందించాలని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ కోరారు.
ఇటీవల సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ విషాద సంఘటన ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో డ్రైనేజీ పైప్‌లైన్ల శుభ్రత పనులు చేపట్టే మున్సిపల్ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలను తప్పనిసరిగా అందించాలని కోరారు. ప్రమాదకరమైన పనులు నిర్వహించే సమయంలో కార్మికులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన భద్రతాoచర్యలు తీసుకోవాలని, సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించి, అవసరమైన సూచనలు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.