ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. (గ్రామ సర్పంచ్ విద్యా బలరాం)
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 25
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతుందని సర్పంచ్ విద్యా బలరాం తెలిపారు.. బుధవారం రోజున ఉదయం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆన్లైన్ కార్యక్రమం ప్రారంభించారు.. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేసుకోవాలని అన్నారు. కావున రేపు కూడా మన గ్రామంలో 10 గంటలకు ఆన్లైన్ కార్యక్రమం కొనసాగుతుంది కావున మిగిలిన వారు పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆన్లైన్ కుటుంబ బీమా పూర్తి చేసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కార్యదర్శి జిపి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ అవకాశాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పూజారి గణేష్, బొగ్గుల గంగాధర్, మంత్రి సాయిలు, విశ్వనాధ్ పంతులు, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు..