prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 4:57 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఈరోజు కుశనపెల్లి లక్ష్మణ్–నవీన దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ డెలిగేట్ తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోళ్ళ తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో నాయకులు రంగు తిరుపతి, గ్రామ అధ్యక్షులు బిడారి భూమయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె జితేందర్, కన్వీనర్ కుశనపెల్లి దుర్గయ్య, పోశం, కుమ్మరి ఎల్లయ్య, ఓరుగంటి రాజయ్య, సత్తయ్య పాల్గొన్నారు.