prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 1:58 pm Digital Edition : SRIKANTH MULUGU

ఆరోగ్యం మా సంకల్పం

 

సోమలగడ్డలో మెగా హెల్త్ క్యాంప్

పస్రా సిఐ దయాకర్
ఎస్సైలు తాజుద్దీన్, అంజనేయులు

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లా పోలీస్ శాఖ, IMA వరంగల్ మరియు టీమ్ సంకల్ప్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పస్రా రెండవ SI అంజనేయులు తెలిపారు.

గోవిందరావుపేట మండలం సోమలగడ్డలోని PSR ఫంక్షన్ హాల్ లో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్యాంప్ జరుగుతుంది.

ఈ క్యాంప్ లో 9 రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాల నుండి ఒక్కొక్కరు, 7 రకాల బ్రాడ్ స్పెషాలిటీ విభాగాల నుండి ముగ్గురు చొప్పున వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, సలహాలు, సూచనలు అందజేయనున్నారు.

న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్.
ఆప్తాల్మాలజిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ENT, ఆర్థోపెడిక్, డెర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్.

ఇందులో భాగంగా మంగళవారం గుత్తికోయ గూడెంను సందర్శించిన SI అంజనేయులు, గూడెం ప్రజలతో సమావేశమై క్యాంప్ వివరాలను వివరించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోలీస్ అంటే కేవలం కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా మా బాధ్యత. అందుకే వైద్యులను మీ దగ్గరికే తీసుకొస్తున్నాం అని SI అంజనేయులు అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గూడెం మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.