prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 7:44 pm Digital Edition : MAHESH MEDCHAL

అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాస వనభోజనాలు ఆధ్యాత్మికత, ఆప్యాయత, సోదరభావంతో ఆనందంగా గడిపిన ఉపాధ్యాయులు

అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాస వనభోజనాలు
ఆధ్యాత్మికత, ఆప్యాయత, సోదరభావంతో ఆనందంగా గడిపిన ఉపాధ్యాయులు
మేడ్చల్: అత్వెల్లి ఉన్నత పాఠశాలలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి ఆప్యాయత, అనురాగం, సోదరభావంతో ఆనందంగా గడిపారు.
కార్తీకమాస ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా అందరూ కలిసి భగవంతుని ఆరాధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఉపాధ్యాయులు తమ ఇళ్ల నుంచి తెచ్చుకున్న వివిధ రకాల భోజన పదార్థాలను ఒకరికొకరు ప్రేమతో పంచుకుంటూ, కుటుంబ సభ్యుల్లా కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా మారగా, ఉపాధ్యాయుల మధ్య స్నేహబంధాలు మరింత బలపడ్డాయి.