prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 9:40 am Digital Edition : PRAJA VANI

అంబాలలో దళితుల సమరభేరి.. చలో వరంగల్ కరపత్రం ఆవిష్కరణ

అంబాలలో దళితుల సమరభేరి.. చలో వరంగల్ కరపత్రం ఆవిష్కరణ

ప్రజావాణి నవంబర్ 24

ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి – దళిత డిక్లరేషన్‌కు చట్టబద్ధత కల్పించాలి

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో దళితుల సమరభేరి – చలో వరంగల్ సభకు సంబంధించిన కరపత్రాలను మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు

సమితి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు చిట్టూపాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ కరపత్రాలను ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజా గర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీలకు రూ.12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు

అలాగే మాల మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, ఏటా రూ.750 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడంతో పాటు వాటికి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 5, 2026న ఉదయం 11 గంటలకు ఎల్బీనగర్‌లోని కాస్మో కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న దళితుల సమరభేరి – చలో వరంగల్ సభకు దళిత సామాజిక వర్గ ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు యువకులు ఉద్యమ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల ఇన్‌చార్జి జేరిపోతుల శంకర్ ఎంవైఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల ఉపేందర్ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు ఆశీర్వాదం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య కుమ్మరి ఎలియా జేరిపోతుల యాదగిరి కుమ్మరి కుమారస్వామి జేరిపోతుల బిక్షపతి కుమ్మరి లింగయ్య జె అనపర్తి రాసపల్లి కుమారస్వామి కుమ్మరి సునీల్ కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు