పుల్లివీడు పంచాయతీలో పీక్స్‌కు చేరిన వైఎస్సార్సీపీ ప్రచార హోరు.చాటకొండు లలితమ్మ విజయమే లక్ష్యంగా కదిలిన ప్రజాసమూహం!
ముగిసిన పుల్లివీడు పంచాయతీ ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నాయకత్వంలో హోరెత్తిన వైఎస్సార్సీపీ ర్యాలీ! పోరుమామిళ్ల/పుల్లివీడు:నవంబర్ 24ప్రజావాణి పుల్లివీడు గ్రామపంచాయతీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రచార హోరు పీక్స్‌కు చేరింది. పుల్లివీడు గ్రామపంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి చాటకొండు లలితమ్మ విజయమే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.ప్రచార చివరి రోజు కావడంతో నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం అత్యంత ప్రతిష్టాత్మకంగా,ఉత్కంఠభరితంగా మారింది. నేతల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం:వైఎస్సార్సీపీ సీనియర్...