prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 6:03 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పుల్లివీడు పంచాయతీలో పీక్స్‌కు చేరిన వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు.చాటకొండు లలితమ్మ విజయమే లక్ష్యంగా కదిలిన ప్రజాసమూహం!

ముగిసిన పుల్లివీడు పంచాయతీ ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నాయకత్వంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ర్యాలీ!

పోరుమామిళ్ల/పుల్లివీడు:నవంబర్ 24ప్రజావాణి పుల్లివీడు గ్రామపంచాయతీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రచార హోరు పీక్స్‌కు చేరింది. పుల్లివీడు గ్రామపంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి చాటకొండు లలితమ్మ విజయమే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.ప్రచార చివరి రోజు కావడంతో నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం అత్యంత ప్రతిష్టాత్మకంగా,ఉత్కంఠభరితంగా మారింది. నేతల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం:వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి సమర్థవంతమైన ఆధ్వర్యంలో,అలాగే నాగార్జున రెడ్డి ఆశీస్సులతో పుల్లివీడు పంచాయతీ పరిధిలో అభ్యర్థిని బలపరుస్తూ నియోజకవర్గ ముఖ్య నేతలు విస్తృతంగా పర్యటించారు.ఇంటింటికీ తిరుగుతూ చాటకొండ లలితమ్మకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.పుల్లివీడు గ్రామ ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటును వైఎస్సార్సీపీ అభ్యర్థి చాటకొండు లలితమ్మకు కేటాయించిన “కత్తెర”గుర్తుపై వేసి,ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆదిత్య రెడ్డి,నాగార్జున రెడ్డి అనుచరులు,వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామ ప్రజలను భక్తిపూర్వకంగా ప్రార్థించారు.కదిలివచ్చిన జనవాహిని.. మహిళల బ్రహ్మరథం ఎన్నికల ప్రచారానికి తిరుగులేని ముగింపు పలికేలా నిర్వహించిన భారీ ర్యాలీలు, రోడ్‌షోలకు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు,వివిధ విభాగాల కన్వీనర్లు,సచివాలయ కన్వీనర్లు,సోషల్ మీడియా ప్రతినిధులు మరియు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.ముఖ్యంగా పట్టణ,గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు,వృద్ధులు,యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు.ප්‍රచార వాహనాల పై నుంచి అభ్యర్థులు ఓటర్లకు నమస్కరిస్తూ ముందుకు సాగగా,దారిపొడవునా ప్రజలు హారతులు పట్టి,పూలవర్షం కురిపిస్తూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ భారీ ప్రదర్శనలతో పోరుమామిళ్ల,పుల్లివీడు ప్రాంతాలంతా వైఎస్సార్సీపీ నినాదాలతో హోరెత్తి జనసంద్రంగా మారాయి.ముఖ్య నాయకుల సంపూర్ణ మద్దతు ఈ ప్రచార ముగింపు సభలో మరియు భారీ ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్య నేతలు నాగార్జున రెడ్డి,ఆదిత్య రెడ్డి,మాజీ సర్పంచ్ రఘునంద రెడ్డి,ఉపసర్పంచ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.పుల్లివీడు పంచాయతీ సంపూర్ణ అభివృద్ధి సాధించాలన్నా,సంక్షేమ పథకాలు నిరంతరాయంగా ప్రతి ఇంటికీ అందాలన్నా వైఎస్సార్సీపీ మద్దతు ఉన్న చాటకొండ లలితమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పిలుపునిచ్చారు.కార్యకర్తలు,నాయకులు అహోరాత్రులు శ్రమించి పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.