పోరుమామిళ్లలో హోరెత్తిన వైఎస్సార్సీపీ ప్రచార భేరి: సర్పంచ్ అభ్యర్థి షేక్ సునీహ గెలుపే లక్ష్యంగా నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!

పోరుమామిళ్ల,కడప జిల్లా:నవంబర్ 24ప్రజావాణి కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రం,మేజర్ పంచాయతీ అయిన పోరుమామిళ్ల పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ శక్తినంతటినీ ఒడ్డి ప్రచార రంగంలో దూసుకుపోయాయి.ఇందులో భాగంగా,పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచి అభ్యర్థిగా బరిలో ఉన్న షేక్ సునీహ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం పట్టణంలో ఊహించని రీతిలో భారీ ఎత్తున ఎన్నికల ప్రచార...