రాజరాంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి నవంబర్ 23 (ప్రజావాణి) రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దళారులను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు....