prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 7:06 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

రాజరాంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి నవంబర్ 23 (ప్రజావాణి)

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దళారులను నమ్మి రైతులు మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని నిబంధనల ప్రకారం ఆరబెట్టి, తేమ శాతం తగిన విధంగా ఉండేలా చూసుకొని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ ఎడ్ల అనిల్ కుమార్, ఎంపీడీవో దొండ కృపాకర్, వ్యవసాయ అధికారి కామల్ల మహేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొల్ల తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ గూడా రామ్ రెడ్డి, ఉపసర్పంచ్ మెరుగు జానీ, వార్డు సభ్యులు మాచర్ల రమేష్, గొల్లపెల్లి మల్లేశం, పాతగూడూర్ సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, ముంజంపల్లి సర్పంచ్ సింగారెడ్డి లింగారెడ్డి, ఏపీఎం తులసి మాత, సీసీ ప్రేమలత హాజరయ్యారు. వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ వెల్గటూర్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, ఎండపల్లి మండల అధ్యక్షులు  గెల్లు చంద్రశేఖర్, నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, పోసెట్టి రమేష్, గాజుల లక్ష్మణ్, వివోఏలు గాజుల సరిత, ఏదుల కల్పన, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.