జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఇటుకాల పురుషోత్తం ను భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు భూమి మైసన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్దులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నవంబర్ 19వ తేదీన జరిగిన ఇందిరమ్మ జన్మదిన వేడుకల గురించి వారు వివరించారు. వేడుకలు ఘనంగా నిర్వహించిన విధానం, ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా భూ రక్షణ సమితి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చించినట్లు నాయకులు తెలిపారు.