శివనామస్మరణతో మార్మోగిన రామన్నగూడెం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం

శివనామస్మరణతో మార్మోగిన రామన్నగూడెం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం. ఏటూరునాగారం నవంబర్ 24,ప్రజావాణి: ​కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామన్నగూడెంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గంగా స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల "హర హర మహాదేవ.. శంభో శంకర" అనే నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ​సాయంత్రం వేళ భక్తులు వెలిగించిన కార్తీక దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా మెరిసిపోయింది. మహిళలు, చిన్నారులు,...