prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 6:51 pm Digital Edition : PRAJA VANI

శివనామస్మరణతో మార్మోగిన రామన్నగూడెం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం

శివనామస్మరణతో మార్మోగిన రామన్నగూడెం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం.

ఏటూరునాగారం నవంబర్ 24,ప్రజావాణి:

​కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామన్నగూడెంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గంగా స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల “హర హర మహాదేవ.. శంభో శంకర” అనే నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
​సాయంత్రం వేళ భక్తులు వెలిగించిన కార్తీక దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా మెరిసిపోయింది. మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభతో కూడిన పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.