*వాగులో స్నానానికి వెళ్లి…*   *ప్రమాదవశాత్తు నీట మునిగి*… *వృద్ధుడి మృతి* *కార్తీక పౌర్ణమి సందర్భంగా స్నానానికి వెళ్లి మృత్యువాత..*   *రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు*

నంగునూరు, నవంబరు 24:కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వాగులో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన రాజగోపాలపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాతా గ్రామానికి చెందిన బండారి కనకయ్య (73), గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని మంగళవారం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో గ్రామ సమీపంలోని మోయ తుమ్మెద వాగు చెక్‌డ్యామ్ వద్ద...