prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 1:09 pm Digital Edition : RAJASHEKARREDDY

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు పెర్కబండ విద్యార్థి ఎంపిక

క్రీడల్లో ప్రతిభ చాటిన వడ్లూరి రిశ్విత్‌.. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పెర్కబండ గ్రామానికి చెందిన వడ్లూరి రిశ్విత్ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. కోహెడ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న రిశ్విత్ తన క్రీడా ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందిస్తున్న కోహెడ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు పీడీ అరవింద్, పీఈటీ ప్రవీణ్, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.