పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా..
సర్పంచ్ బొల్లం శ్రీధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్
బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ప్రారంభించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు సైతం ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోనగాం రమేష్, లోనే నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తి రమేష్, అధికార ప్రతినిధి జెల్ల ప్రభాకర్, బండి వేణు, సంగ రమేష్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.