బుగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతర పటిష్ట పోలీస్ బందోబస్తు.. క్యూ లైన్లో సజావుగా దర్శనాలు
రేగొండ మండలం తిరుమలగిరిలో శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు భూపాలపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రతి చోటా నిఘా పెట్టారు. స్వామివారి గుట్టపైకి భక్తులను క్యూ లైన్ లో క్రమపద్ధతిలో పంపించడం జరుగుతుంది. వృద్ధులు,...