
రేగొండ మండలం తిరుమలగిరిలో శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు భూపాలపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రతి చోటా నిఘా పెట్టారు.
స్వామివారి గుట్టపైకి భక్తులను క్యూ లైన్ లో క్రమపద్ధతిలో పంపించడం జరుగుతుంది. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
దేవుని సన్నిధిలో ఘనపూర్ సీఐ కరుణాకర్ రావు మరియు రేగొండ ఎస్ఐ బి. సుధాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దర్శనం అయిన వెంటనే ఒక్కొక్కరిని సజావుగా పంపిస్తూ, తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
12 మంది ఎస్ఐలు, సుమారు 170 మంది పోలీస్ సిబ్బందితో జాతర ప్రశాంతంగా, భక్తిభావంతో జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.