prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 2:45 pm Digital Edition : PRAJA VANI

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఓదెలకు మరోసారి ప్రాతినిధ్యం

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఓదెలకు మరోసారి ప్రాతినిధ్యం

రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా రూపురెడ్డి ఆదిరెడ్డి నియామకం

మూడు దశాబ్దాల పార్టీ సేవకు గుర్తింపు.. ఆదిరెడ్డికి మరోసారి రాష్ట్రస్థాయి బాధ్యతలు!

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌లో ఆదిరెడ్డి హవా.. రెండోసారి కీలక పదవిలో నియామకం!

**ఓదెల, పెద్దపల్లి, ప్రజావాణి ప్రతినిధి:**

భారతీయ జనతా పార్టీలో మూడు దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన రూపురెడ్డి ఆదిరెడ్డికి మరోసారి రాష్ట్రస్థాయి కీలక బాధ్యత దక్కింది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఆయనను రెండోసారి నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు ఆదిరెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతున్న ఆయన, పార్టీ అప్పగించిన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఆయన సేవలు, పార్టీ పట్ల చూపిన అంకితభావాన్ని గుర్తించి మరోసారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అవకాశం కల్పించడం పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

తన నియామకానికి సహకరించి ప్రోత్సహించిన బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డిలకు రూపురెడ్డి ఆదిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రెండోసారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టడం ఆదిరెడ్డి రాజకీయ అనుభవానికి, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన నియామకం పట్ల ఓదెల మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. జీలకుంట గ్రామానికి చెందిన నాయకుడికి రాష్ట్రస్థాయిలో మరోసారి గుర్తింపు లభించడం పట్ల గ్రామస్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.