పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి లక్ష్మణ్ కుమార్
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు అందిస్తామని భరోసా జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ నవంబర్ 24 (ప్రజావాణి): కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెరదించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు నూతనంగా మంజూరైన 812 'చేయూత' పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి...