పెనుమూరు 9వ వార్డు బరిలో టీడీపీ అభ్యర్థి షేక్ అల్తాఫ్ భాష
పెనుమూరు ప్రజావాణి ప్రతినిధి నవంబర్ 24
పెనుమూరు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెనుమూరు గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 9వ వార్డు అభ్యర్థిగా షేక్ అల్తాఫ్ భాష పోటీకి సిద్ధమయ్యారు.
వార్డు ప్రజల ఆదరణతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన, ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
9వ వార్డు ఎన్నికల్లో షేక్ అల్తాఫ్ భాష పోటీ చేయడంతో స్థానికంగా ఎన్నికల వాతావరణం ఆసక్తికరంగా మారింది.