*పాలమాకులలో శ్రీ శంభు దేవాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం* *ఆలయ నిర్మాణంలో ప్రతి భక్తుడూ భాగస్వామి కావాలి*  – కమిటీ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ రెడ్డి 

నంగునూరు, నవంబరు 24:కార్తీక పౌర్ణమి పర్వదినం పాలమాకుల గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామంలోని శ్రీ శంభు దేవాలయ పునర్నిర్మాణానికి భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఇటీవల ఎన్నికైన నూతన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు విశేషంగా స్పందించారు. గ్రామానికి చెందిన భక్తులతో పాటు చుట్టుపక్కల వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అన్నప్రసాద వితరణలో ఉత్సాహంగా పాల్గొని...