prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 10:51 am Digital Edition : MAHESH MEDCHAL

పటేల్ ఎంటర్ ప్రాజెస్ వ్యర్థ జలాలతో వాహన దారులకు ఇబ్బందులు

*పటేల్ ఎంటర్ ప్రాజెస్ వ్యర్థ జలాలతో వాహన దారులకు ఇబ్బందులు*

*రాత్రికి రాత్రే రోడ్డుపై వ్యర్థ జలాలు వదులుతున్నారని ఆరోపణలు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్*

మేడ్చల్: మేడ్చల్ సిఎంసి పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న పటేల్ ఎంటర్ ప్రాజెస్ సంస్థ వ్యర్థ జలాలను రాత్రికి రాత్రే కిష్టాపూర్ దారిలో బహిరంగంగా వదిలేస్తున్నట్లు స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డుపై ఉన్న గుంతల్లో వ్యర్థ జలాలు నిల్వ ఉండి, వాహనాలు వెళ్లేటప్పుడు దుర్వాసనతో కూడిన నీరు పాదచారులు, ఇతర వాహనదారులపై చిమ్ముతోంది. ఈ పరిస్థితితో
ఆమార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మీద నిల్వ ఉన్న మురుగు నీటి కారణంగా దుర్వాసన వెదజల్లుతూ, వాహనదారులు ఈ దారిలో వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మురుగు నీటి చిమ్ముడుతో అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ వ్యర్థ జలాలను రోడ్లపై వదిలేస్తున్న సదరు సంస్థపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. రోడ్లపై వ్యర్థ జలాలు వదలకుండా శాశ్వత చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.