prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:32 pm Digital Edition : PRAJA VANI

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య

బాన్సువాడ : నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని అంబేద్కర్ సంఘాల నాయకులు, సభ్యులు, యువత, మహిళలు ప్రజల భాగస్వామ్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. అనంతరం భారత రాజ్యాంగ ప్రవేశికను చదివి, రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బంగారు మైసయ్య కోరారు.
జై భీమ్.. జై భారత రాజ్యాంగం!