*ధ్యానంతో ఆరోగ్యకరమైన ఆలోచనలు.. ప్రశాంతమైన జీవనం
*
మేడ్చల్ (ప్రజా వాణి):- రాజయోగ ధ్యాన శిక్షణతో మానసిక ప్రశాంతతకు మార్గం
మానసిక ఒత్తిడి తగ్గించుకుని ప్రశాంతమైన జీవనం గడిపేందుకు రాజయోగ ధ్యానం ఎంతగానో ఉపయోగ పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాజయోగ ధ్యాన శిక్షణ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోవడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణలో మనసు, బుద్ధి, ఆత్మ, ధ్యానం, సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు సంబంధించిన విషయాలను వివరించనున్నట్లు ప్రకటనలో సూచించారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించుకుని ప్రశాంతమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి రాజయోగ ధ్యానం దోహదపడుతుందని తెలిపారు. ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతతను పొందేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.