prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 7:28 am Digital Edition : UPENDHAR JANAGON

జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలి..!

 

కేయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేసిన బిర్రు ఇస్తారి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ రామచంద్రంను సోమవారం సన్మానించారు.

ఈ సందర్భంగా జనగామకు కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని, జనగామ పీజీ కాలేజీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని, అదనపు గదులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాలేజీ అభివృద్ధిపై చర్చించారు.

పీజీ కాలేజీ 95 శాతం పూర్తయిందని, మిగిలిన 5 శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. జనగామలో ఇంజనీరింగ్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని తెలిపారు.

ఇక్కడ నిరుపేద విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయని, జనగామ జిల్లా విద్యా కేంద్రంగా మారుతుందని, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకోవచ్చని ఆయన అన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీ త్వరగా మంజూరు కావడానికి పూర్తి సహకరిస్తానని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు. త్వరలో జనగామ పీజీ కాలేజీని సందర్శిస్తానని తెలిపారు.