prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 9:37 pm Digital Edition : UPENDHAR JANAGON

కారుపోతుల వెంకటేష్ కుమారుడికి ఆశీస్సులు అందించిన ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు కారుపోతుల వెంకటేష్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు

ఈ సందర్భంగా చిన్నారికి కేక్ తినిపించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తల్లిదండ్రులకు తగిన పేరు తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు.

కార్యకర్తల కుటుంబాల్లో జరిగే ప్రతి శుభకార్యాన్ని తమ ఇంటి వేడుకగా భావిస్తూ, వారి సంతోషాల్లో భాగస్వాములవుతూ ఆప్యాయతను పంచుకోవడమే ఎర్రబెల్లి కుటుంబం ప్రత్యేకత అని ఉషా దయాకర్ రావు అన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి వెంటే ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి గూడెం సర్పంచ్ చింత రవి, ఉపసర్పంచ్ నర్ర కోమలత సోమశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షుడు లొడంగి వెంకటేశ్వర్లు, మండల నాయకులు ఏల సుందర్, కారుపోతుల బిక్షపతి, కోతి ప్రవీణ్, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.