prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:54 pm Digital Edition : RAJASHEKARREDDY

కనిపించని గుంత.. ప్రమాదంలో వాహనదారుల ప్రాణాలు!

రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు.. రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి

బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామం నుంచి బెజ్జంకి క్రాసింగ్‌కు వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని  వాహనదారులు,గ్రామస్తులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుంతల కారణంగా బైకులు అదుపుతప్పి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.