prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 1:57 pm Digital Edition : RAJASHEKARREDDY

ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం

– సర్పంచ్ బైరా మానస రాజేందర్

బెజ్జంకి, నవంబర్ 24 (ప్రజావాణి)

 

ఇందిరమ్మ బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని  దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ అన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబాలకు బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గ్రామ పంచాయతీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాల్ నర్సు, పంచాయతీ కార్యదర్శి సురేష్, వార్డు సభ్యులు నేతి మహేష్, సవనపెల్లి రాజు, గదాగోని అశోక్, గ్రామ పెద్దలు నవీన్, శ్రీకాంత్, కానుకయ్య, రాజు, కొమురయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.