వార్డు ప్రజలే నా కుటుంబం.సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: దైవసాక్షిగా ప్రమాణం చేసిన బద్వేల్ 24వ వార్డు కౌన్సిలర్ మాచుపల్లి లక్ష్మీదేవి.పేద కుటుంబాల దహన సంస్కారాలకు ₹5,000 ఆర్థిక సాయం ప్రకటన
బద్వేల్,నవంబర్23(ప్రజావాణి):బద్వేల్ మున్సిపాలిటీ 24వ వార్డులో సరికొత్త సేవా శకానికి నాంది పలికారు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ మాచుపల్లి లక్ష్మీదేవి.రాజకీయాలు అంటే కేవలం పదవులు, అధికారాలు కాదని,అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశమని ఆమె నిరూపించారు.వార్డు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా,ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆమె భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా వార్డులోని పేద కుటుంబాలకు అండగా నిలిచేలా ఒక కీలకమైన మానవతా నిర్ణయాన్ని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.దైవసాక్షిగా ప్రమాణం ప్రజలే నా కుటుంబంపదవీ బాధ్యతలు...