పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన వైఎస్సార్‌సీపీ; షేక్ సునీహ గెలుపే లక్ష్యంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి విస్తృత పర్యటన

పోరుమామిళ్ల,నవంబర్ 23 (ప్రజావాణి వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నాయి.బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతిష్టాత్మక పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది.ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి షేక్ సునీహని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి.ఇందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి పోరుమామిళ్ల వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొలిమి వీధి, ఆర్యవైశ్య నగర్‌లలో ఇంటింటి ప్రచారం:పోరుమామిళ్ల...