prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 9:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన వైఎస్సార్‌సీపీ; షేక్ సునీహ గెలుపే లక్ష్యంగా నల్లేరు విశ్వనాథ రెడ్డి విస్తృత పర్యటన

పోరుమామిళ్ల,నవంబర్ 23 (ప్రజావాణి వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజా క్షేత్రంలోకి దూసుకుపోతున్నాయి.బద్వేల్ నియోజకవర్గంలోని ప్రతిష్టాత్మక పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది.ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి షేక్ సునీహని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి.ఇందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి పోరుమామిళ్ల వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కొలిమి వీధి, ఆర్యవైశ్య నగర్‌లలో ఇంటింటి ప్రచారం:
పోరుమామిళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కొలిమి వీధి,ఆర్యవైశ్య నగర్ తదితర ప్రాంతాలలో నల్లేరు విశ్వనాథ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిని షేక్ సునీహతో కలిసి విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్తూ,ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.స్థానిక ప్రజలు,మహిళలు, వృద్ధులు నల్లేరు విశ్వనాథ రెడ్డి కి,వైఎస్సార్‌సీపీ నాయకులకు ఘనస్వాగతం పలికారు.ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విశ్వనాథ రెడ్డి,గ్రామ సమగ్ర అభివృద్ధి కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
పోరుమామిళ్ల సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం నల్లేరు విశ్వనాథ రెడ్డి:
పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలు,ప్రజా సమావేశాలలో నల్లేరు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ.పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు.గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ప్రజా సంక్షేమం,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రజలకు వివరించారు.పోరుమామిళ్ల పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం, అంతర్గత రహదారుల నిర్మాణం,డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ మరియు ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలంటే షేక్ సునీహ ని సర్పంచ్‌గా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
బ్యాలెట్ పేపర్‌లో 6వ నంబర్ కప్పు సాసర్”గుర్తుకు ఓటు వేయాలి:
రాబోయే నవంబర్ 26వ తేదీన జరగబోయే పోరుమామిళ్ల పంచాయతీ ఎన్నికలలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బ్యాలెట్ పేపర్‌లో 6వ నంబర్‌పై ఉన్న కప్పు సాసర్”గుర్తుపై ఓటు వేసి,శ్రీమతి షేక్ సునీహ ని అత్యధిక మెజారిటీతో విజయతీరాలకు చేర్చాలని అభ్యర్థించారు.ఓటర్లు వేసే ప్రతి ఓటు గ్రామ భవిష్యత్తును మార్చే ఒక బలమైన ప్రజాస్వామ్య నిర్ణయమని, అభివృద్ధి పక్షాన నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు,కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు,మహిళలు పాల్గొని షేక్ సునీహ కి మరియు నల్లేరు విశ్వనాథ రెడ్డి కి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.”జై వైఎస్సార్‌సీపీ”నినాదాలతో పోరుమామిళ్ల పురవీధులు మారుమోగాయి.