రంగసముద్రం ఎన్నికల వేడి 8వ వార్డు మెంబర్ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో హోరెత్తిన ప్రచారం సర్పంచ్ అభ్యర్థి దాసరపల్లి దివ్య గెలుపే లక్ష్యంగా వీధి వీధి పర్యటన
పోరుమామిళ్ల(కడప జిల్లా)నవంబర్ 23:ప్రజావాణి వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరింది. రంగసముద్రం సర్పంచ్ స్థానానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మద్దతుతో బరిలోకి దిగిన కూటమి అభ్యర్థి దాసరపల్లి దివ్య విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఎనిమిదో వార్డు మెంబర్ అభ్యర్థి కల్వకూరి రమణ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి శ్రేణులు ప్రతి వీధిని చుట్టేస్తున్నాయి. మహబూబ్‌నగర్...