భగవంతుని సాక్షిగా.. ప్రజల సేవకే నా జీవితం అంకితం: బద్వేల్ 24వ వార్డు కౌన్సిలర్ మాచుపల్లి లక్ష్మీదేవి భావోద్వేగ ప్రకటన! బద్వేల్ మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన మాచుపల్లి లక్ష్మీదేవి సరికొత్త సేవా శకానికి నాంది పలికారు. వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తానని ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రాజకీయాలు అంటే కేవలం పదవులు, అధికారాలు కాదని.. అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశమని...