40 ఏళ్ల దారిని మూసేస్తే మా బతుకులేం కావాలి
40 ఏళ్ల దారిని మూసేస్తే మా బతుకులేం కావాలి..? దారి కబ్జాపై పోతంగల్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధిత అన్నదాతలు..! తక్షణమే స్పందించి దారి తెరిపించాలని సుంకిని రైతుల వేడుకోలు. కోటగిరి/ప్రజావాణి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామ రైతులు తమ పొలాలకు వెళ్లే దారి సమస్యపై కదం తొక్కా రు.గత 40 ఏళ్లుగా వాడుకలో ఉన్న తమ పొలాల దారిని అక్రమంగా మూసివేశారని ఆరోపిస్తూ బాధిత రైతులంతా కలిసి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయానికి తరలివచ్చి తహసీల్దార్‌కు వినతిపత్రం...