prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 8:20 pm Digital Edition : PRAJA VANI

40 ఏళ్ల దారిని మూసేస్తే మా బతుకులేం కావాలి

40 ఏళ్ల దారిని మూసేస్తే మా బతుకులేం కావాలి..?

దారి కబ్జాపై పోతంగల్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధిత అన్నదాతలు..!

తక్షణమే స్పందించి దారి తెరిపించాలని సుంకిని రైతుల వేడుకోలు.

కోటగిరి/ప్రజావాణి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామ రైతులు తమ పొలాలకు వెళ్లే దారి సమస్యపై కదం తొక్కా రు.గత 40 ఏళ్లుగా వాడుకలో ఉన్న తమ పొలాల దారిని అక్రమంగా మూసివేశారని ఆరోపిస్తూ బాధిత రైతులంతా కలిసి సోమవారం మండల రెవెన్యూ కార్యాలయానికి తరలివచ్చి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.సుంకిని నుండి మందర్నకు వెళ్లే మార్గమధ్యంలో గల జక్క దిగంబర్ పటేల్, జాదవ్ సంబాజీ పొలాల మధ్య నుండి లోపల ఉన్న రైతుల పొలాలకు వెళ్లడానికి గత 40 ఏళ్లుగా దారి ఉందని.అయితే గత రెండు రోజుల క్రితం జాదవ్ సంబాజీ అనే రైతు ఆ దారిని మూసివేయడంతో లోపలి పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది.గత నలభై ఏళ్లుగా ఇదే దారి గుండా మా పొలాలకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నపళంగా దారిని మూసివేయడం వల్ల పంట పనులకు వెళ్లలేక,వ్యవసాయ పరికరాలు తీసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనివాపోయారు.రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మా పొలాలకు వెళ్లే దారిని వెంటనే తెరిపించాలి అని కోరారు.ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చిన వారిలో సుంకిని గ్రామ రైతులు ఎస్.బాలాజీ పటేల్,టి.శంకర్,టి.లక్ష్మణ్,టి. జ్ఞానేశ్వర్,ఎస్.అశోక్,సి.హెచ్.బస్వంత్,సి.హెచ్.యాదు, సి.హెచ్.శంకర్,సి.హెచ్.మారుతి,చాకలి శంకర్,తదితరులు ఉన్నారు.